16 February, 2019 | Category : NEWS

ఫే రివిజన్ పై పరిణామాలు

ఫే రివిజన్ పై పరిణామాలు గత రెండు రోజులుగా సిఎండి మరియు డైరెక్టర్( హెచ్ ఆర్) ఏయుఏబి తో చర్చించారు. డిఓటి 0 శాతం ఫిట్మెంటు తో పే రివిజన్ వెంటనే చేస్తామని, ఆ తరువాత మంత్రి గారు 5% ఫిట్మెంటు ఇవ్వాలని కేబినెట్ కు సిఫార్సు చేస్తారని సిఎండి అన్నారు. దీనిపై ఏయుఏబి అంతర్గతముగా చర్చించింది. మన కనీస డిమాండ్ 10 % ఫిట్మెంటని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ఏయుఏబి, సిఎండి గారి ద్వారా డిఓటికి తెలియజేసింది. 0 శాతం ఫిటమెంటు కే డిఓటి కమిటయిందని బిఎస్ఎన్ఎల్ఇయు అంచనా. 5% ఫిట్మెంట్ ను కేబినెట్ ఆమోదానికి పంపిస్తామని మంత్రి గారు అన్నా గత అనుభవం రీత్యా ఈ హామీని మనము నమ్మ లేము. మంత్రి గారు మరియు డిఓటి లు ప్రతి హామీని ఉల్లంఘించారు. కాబట్ జిల్లా యూనియన్ లు ఏయుఏబి యూనియన్ లు అసోసియేషన్లతో కలిసి సమ్మె సంపూర్ణముగా జరిగేలా చూడాలి. ఏదయినా కొత్త పరిణామం జరిగితే వెంటనే తెలియ జేస్తాము. కానీ మన కర్తవ్యం సమ్మె సంపూర్ణముగా జరిగేలా చూడటం..... సిఎస్

RELATED POSTS :