13 December, 2018 | Category : NEWS

11.12.2018న ఢిల్లీ లో జరిగిన ఏయు ఏబి సమావేశం నిర్ణయాలు

ఈ సమావేశంలో బిఎస్ఎన్ఎల్ఇయు, ఎన్ఎఫ్టిఇ, ఎస్ఎన్ఎల్ఇఏ, ఏఐబిఎస్ఎన్ఎన్ఎల్ఇఏ, ఏఐజిఇటిఓఏ, బిఎస్ఎన్ఎల్ఎంఎస్ , బిఎస్ఎన్ఎల్ఏటిఎం, బిఎస్ఎన్ఎల్ఓఏ ప్రతినిధులు పాల్గొన్నారు. 3.12.2018న మంత్రిగారితో జరిగిన ఒప్పందం అమలు పై, సమ్మె వాయిదా తరువాత ఏర్పడిన పరిస్థితి పై చర్చించిన అనంతరం ఈ క్రింది నిర్ణయాలు చేసింది:  1. ఏయుఏబి ప్రతినిధులు డిఓటి ఎడిషనల్ సెక్రెటరీ, మెంబర్ ( సర్వీసెస్), మెంబర్ ( టెక్నాలజీ), జాయింట్ సెక్రటరీ ( ఎడ్మిన్) లను కలిసి  బిఎస్ఎన్ఎల్ కు 4 జి స్పెక్ట్రమ్, ప్రభుత్వ రూల్సు ప్రకారం పెన్షన్ కంట్రిబ్యూషన్ చెల్లింపుకు బిఎస్ఎన్ఎల్ కు అనుమతి, బిఎస్ఎన్ ఎల్ రిటైరీస్ కు పెన్షన్ రివిజన్ హామీల అమలు విషయం లో  ప్రస్తుత పరిస్థితి పై చర్చించాలి.  2. మంత్రి గారి ఆదేశాల ప్రకారం డిమాండ్ల పై ఇచ్చిన హామీల అమలు పై  పర్యవేక్షించేందుకు ఎడిషనల్ సెక్రటరీ ( టెలికం) అధ్యక్షతన డిఓటి, బిఎస్ఎన్ఎల్ మరియు ఏయుఏబి ల ప్రతినిధులతో ఒక వ్యవస్థీకృత యంత్రాంగాన్ని ఏర్పాటు చేస విషయం డిఓటి తో చర్చించాలి.  3. 2018 డిసెంబరు 26- 29 మధ్య అన్ని జిల్లాలలో ఏయుఏబి యూనియన్ల/ అసోసియేషన్ల జాయింట్ జనరల్ బాడీ మీటింగులు పెట్టి నిరవధిక సమ్మె వాయిదా కి సంబంధించిన విషయాలను వివరించాలి.  4. ఈ జనరల్ బాడీ సమావేశాలల వివరించేందుకు వీలుగా మంత్రి గారి తో జరిగిన సమావేశంలో కుదిరిన ఒప్పందం వివరాలు మరియు సమ్మె వాయిదాకి దారితీసిన పరిస్థితులు తెలియజేస్తూ ఏయుఏబి ఒక ప్రకటన జారీ చేయాలి. జాయింటు జనరల్ బాడీ సమావేశాలల ఈ ప్రకటనలో వుండే అంశాలను వివరించాలి.  5. డైరెక్ట్ రిక్రూటీస్ కు 30 శాతం రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయం లో 2.12.2018 న జరిగిన చర్చలలో బిఎస్ఎన్ఎల్ మేనేజిమెంటు ఇచ్చిన హామీ ని తెలియజేస్తూ ఈ చర్చలకు సంబంధించిన మినిట్సు ఇవ్వాలని ఏయుఏబి తరఫున సిఎండి కి లెటరు రాయాలి. మంత్రి గారి ఆదేశాల ప్రకారం డిమాండ్ల పై ఇచ్చిన హామీల అమలు పై  పర్యవేక్షించేందుకు ఎడిషనల్ సెక్రటరీ ( టెలికం) అధ్యక్షతన డిఓటి, బిఎస్ఎన్ఎల్ మరియు ఏయుఏబి ల ప్రతినిధులతో ఒక వ్యవస్థీకృత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఏయుఏబి ఇంతకు ముందే రాసిన లెటరుకు డిఓటి స్పందించింది. ఈ వ్యవస్థీకృత యంత్రాంగం ఏర్పాటుకు ఫైలు ఇప్పటికే కదలికలో వున్నదని, త్వరలో ఈ యంత్రాంగం సమావేశం ఏర్పాటు చేసి మంత్రిగారి హామీల అమలు ఏ మేరకు ముందుకు వెళ్ళిందో సమీక్షించుదామని ఎడిషనల్ సెక్రటరీ( టెలికం) కార్యాలయం ఏయుఏబి కి తెలియజేసింది.

  1. 11.12.2018న ఢిల్లీ లో జరిగిన ఏయు ఏబి సమావేశం నిర్ణయాలు 3.pdf : Download File

RELATED POSTS :

3 January, 2019 | Category : NEWS

కామ్రేడ్స్, 2019 జనవరి 8, 9 తేదీలలో జరుగు 2 ర

కామ్రేడ్స్, 2019 జనవరి 8, 9 తేదీలలో జరుగు 2 రోజుల సార్వత్రిక

READ MORE

3 January, 2019 | Category : NEWS

Booklet on General Strike on 8th and 9th January 2019

Booklet in Telugu by Com. Asoka Babu on General Strike on 8th and 9th January 2019

READ MORE

14 January, 2019 | Category : NEWS

బిఎస్ఎన్ఎల్ ప్రయివేటీకరణకి అనుగుణము

బిఎస్ఎన్ఎల్ ప్రయివేటీకరణకి అనుగుణముగా సమర్పించబడిన

READ MORE