13 December, 2018 | Category : NEWS

సమ్మె ఎందుకు వాయిదా పడింది?

సమ్మె ఎందుకు వాయిదా పడింది? 2.12.2018న డిఓటి సెక్రెటరీ తో, 3.12.2018న మంత్రి గారితో జరిగిన చర్చల ఫలితం పై ఏయూఎబి సమీక్ష. సమ్మె పిలుపు వలన డిఓటి సెక్రెటరీ మరియు మంత్రిగారు ఏయూఎబి తో చర్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ చర్చలలో ఏయూఎబి లేవనెత్తిన ఈ క్రింది డిమాండ్సు పరిష్కారమయ్యాయి: 1. 4జి స్పెక్ట్రమ్ కేటాయింపు: ప్రయివేటు టెలికాం కంపెనీలకు 4జి స్పెక్ట్రమ్ వుంది. కానీ బిఎస్ఎన్ఎల్ కు లేదు. కాబట్టి ప్రయివేటు కంపెనీలతో పోటీలో నిలబడేందుకు బిఎస్ఎన్ఎల్ కు 4 జి స్పెక్ట్రమ్ అవసరం. బిఎస్ఎన్ఎల్ కు 4 జి స్పెక్ట్రమ్ కేటాయిస్తామని ఫిబ్రవరి 2018 లో మంత్రి గారు హామీ యిచ్చారు. కానీ అమలు చేయలేదు. నిన్న జరిగిన సమావేశం లో 4జి స్పెక్ట్రమ్ కేటాయింపుకు కేబినెట్ అనుమతి కోసం కేబినెట్ నోట్ తయారు చేశామని, ఇతర మంత్రిత్వ శాఖల కు కూడా దీనిని సర్క్యులేట్ చేశామని మంత్రి గారు అన్నారు. ఈ మంత్రిత్వ శాఖల తో సంప్రదించి త్వరగా వాటి ఆమోదం పొందేందుకు డిఓటి లో ఒక సీనియర్ అధికారిని డెప్యూట్ చేస్తామని అన్నారు. ఇదయిన తరువాత ఆ వెంటనే జరుగు కేబినెట్ సమావేశానికి సమర్పిస్తామని అన్నారు. త్వరలోనే బిఎస్ఎన్ఎల్ కు 4జి స్పెక్ట్రమ్ వస్తుందన్నారు. బిఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ కు 4జి స్పెక్ట్రమ్ అవసరం. కాబట్టి నిస్సందేహముగా ఇది ఏయూఎబి ఘన విజయం. 2. బిఎస్ఎన్ఎల్ లో రిటైరయిన వారికి పెన్షన్ రివిజన్: పెన్షన్ రివిజన్ జరగాలంటే పే రివిజన్ జరగాలని ఇప్పటివరకు డిఓటి వాదిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు డిఓటి తన వైఖరిని మార్చుకున్నది. డిఓటి సెక్రెటరీ మరియు మంత్రిగారు పే రివిజన్ తో సంబంధం లేకుండా పెన్షన్ రివిజన్ చేస్తామని ఈ చర్చలలో అన్నారు. ఇది మన సమ్మె పిలుపు సాధించిన విజయం. సాధ్యమయినంత త్వరగా పెన్షన్ రివిజన్ జరిగేందుకు ఏయూఎబి కృషి చేస్తుంది. 3. బేసిక్ పే పై పెన్షన్ కంట్రిబ్యూషన్ చెల్లింపు: డిఓటి నుండి బిఎస్ఎన్ఎల్ లో విలీనమయిన ఉద్యోగుల పెన్షన్ కోసం డిఓటి కి బిఎస్ఎన్ఎల్ చెల్లించే పెన్షన్ కంట్రిబ్యూషన్ ను పే స్కేలు మ్యాగ్జిమమ్ పై కాకుండా బేసిక్ పే పై చెల్లించేందుకు బిఎస్ఎన్ఎల్ ను అనుమతించాలని మనము డిమాండు చేస్తున్నాము. ఈ విషయం లో ప్రభుత్వ రూల్ ను అమలు చేస్తామని మంత్రి గారు అన్నారు. దీని ప్రకారం బేసిక్ పే పై పెన్షన్ కంట్రిబ్యూషన్ చెల్లించవచ్చు. ఇందుకనుగుణముగా సిఫార్సు చేస్తూ ఇప్పటికే ఫైనాన్సు మినిస్ట్రీకి లెటరు రాశామని అన్నారు. ఈ సమస్య పరిష్కారం బిఎస్ఎన్ఎల్ ఆర్థిక పునరుద్ధరణకు తోడ్పడుతుంది. 4. సెకండ్ పిఆర్ సి లో వదిలి వేయబడిన సమస్యలకు పరిష్కారం: బిఎస్ఎన్ఎల్ లో డైరెక్టుగా రిక్రూట్ అయిన వారికి (ఈపీఎఫ్ ఆమలులో వున్న వారికి) సెకండ్ పి ఆర్ సి సిఫార్సు ప్రకారం బేసిక్ పే మరియు డీఏ లో 30 శాతం వారి సూపర్ యన్యువేషన్ బెనిఫిట్సు కు మేనేజిమెంటు కంట్రిబ్యుట్ చేయాలి. ఇప్పటికి కంట్రీబ్యుట్ చేస్తున్న 23 శాతం పోను ఇంకా 7 శాతం ను మేనేజిమెంటు కంట్రీబ్యుట్ చేయాలి. ఇందుకు సిఎండి బిఎస్ ఎన్ ఎల్, 2.12.2018న జరిగిన సమావేశం లో అంగీకరించారు. మార్చి 2019 నాటికి అదనముగా 3 శాతాన్ని, ఆ తరువాత ఒక్కసారిగా మిగతా 4 శాతాన్ని కంట్రీబ్యుట్ చేస్తామని అన్నారు. ఈ విధముగా ఈ సమస్య పరిష్కారం అవుతున్నది. 5. పే రివిజన్: ఈ సమస్యకి అంతిమ పరిష్కారం ఇంకా కాలేదు. పే రివిజన్ చేస్తామని, కానీ ఫిట్మెంట్ బెనిఫిట్ 15 శాతం ఇవ్వలేమని మంత్రి గారు, మరియు డిఓటి సెక్రెటరీ అన్నారు. 15 శాతం ఫిట్మెంట్ బెనిఫిట్ ఎందుకు సమంజసమో ఏయూఎబి నాయకులు వివరించారు. కానీ దీనిని వారు అంగీకరించలేదు. ఈ సమస్యపై డిఓటి తో ఇంకా చర్చించాల్సిన అవసరం వున్నదని, ఇందుకు మరికొంత సమయం అవసరమని ఏయూఎబి భావిస్తున్నది. మంత్రిగారితో చర్చల అనంతరం ఏయూ ఎబి నాయకులు సమావేశమయ్యారు. సమ్మె పిలుపు వలన ప్రధానమయిన ప్రయోజనాలు కొన్ని ఉద్యోగులకు లభించాయని, ఈ ప్రయోజనాలను స్థిరపరచుకోవాలని, వీటి అమలుకు ఆర్డర్సు సాధించుకోవాలని ఏయూఎబి నిర్ణయించింది. పే రివిజన్ సమస్య పరిష్కారానికి డిఓటి కి మరి కొంత సమయం ఇవ్వాలని ఏయూఎబి నిర్ణయించింది. ఏయూఎబి చేస్తున్న ప్రయత్నాలు విఫలమయితే పోరాటాలు అనివార్యం.

  1. సమ్మె ఎందుకు వాయిదా పడింది 2.pdf : Download File

RELATED POSTS :