15 November, 2018 | Category : NEWS

ఆల్ యూనియన్స్ అండ్అసోసియేషన్స్ ఆఫ్ BSNL -డిమాండ్ ల పరిష్కారం కోసం 03-12-2018 నుండి

ఆల్ యూనియన్స్ అండ్అసోసియేషన్స్ ఆఫ్ BSNL - (AUAB)-డియర్ కామ్రేడ్స్ .. ఈ రోజు 14-11-2018 న న్యూఢిల్లీ లో మన కేంద్ర యూనియన్ & అసోసియేషన్స్ జనరల్ సెక్రటరీలు సమావేశమై, గౌరవ కమ్యూనికేషన్ సహాయ మంత్రి గారు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ చేస్తున్న ఆందోళన కార్యక్రమాలను సమీక్షించారు. అంతేగాక, 06-11-2018, మూడోవేతన సవరణ,BSNL కు 4Gస్పెక్ట్రమ్ కెటాయింపు, పెన్షన్ కాంట్రీబ్యూషన్ చెల్లింపులు ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయాలనే మన డిమాండ్లను డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాం(DoT) తిరస్కరించడం పైన ఈ రోజు సమావేశం చర్చించింది. 02-11-2018న టెలికాం కార్యదర్శి యూనియన్స్ కు ఇచ్చిన హామీని టెలికాం డిపార్ట్ మెంట్(DoT) తిరస్కరించడంతో, మన సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. మూడో వేతన సవరణకు అడ్డంకిగా ఉన్న అఫర్డ్ బిలిటీ క్లాజ్ (వేతనాలను భరించగలిగే సామర్థ్యం) నుండి మినహాయింపు కోసం కేబినెట్ అనుమతి కోసం పంపడం కాలయాపన చేయడమేనని సమీక్షించారు. BSNL ఉద్యోగులకు, మూడోవేతన సవరణ తక్షణమే పరిష్కరించాలని అందుకు కేబినెట్ ఆమోదం లేకుండా నే DoT పరిష్కరించాలని డిమాండ్ చేసింది. *కేబినెట్ అనుమతి లేకుండానే,రెండో వేతన సవరణ సమయంలో , MTNL ఉద్యోగులకు, 30%ఫిట్ మెంట్ అమలు చేసింది. *BSNL ఉద్యోగులకూ అలాగే మూడో వేతన సవరణను DoT మాత్రమే పరిష్కరించాలని AUAB తీర్మానించింది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి/మార్చిలో పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం వున్నందున, సమయం ఎక్కువ లేనందున,కేబినెట్ ఆమోదం కోసం పంపడం అంటే మరీ కాలయాపన చేయడమే. పై అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ క్రింది నిర్ణయాలు తీసుకుంది. (1) మూడోవేతన సవరణ అమలుకోసం కేబినెట్ ఆమోదం కోసం పంపకుండానే,DoT పరిష్కరించాలని డిమాండ్ చేయాలని నిర్ణయించారు. (2) మన డిమాండ్ ల పరిష్కారం కోసం 03-12-2018 నుండి నిరవధిక సమ్మె చేయాలని పిలుపునిచ్చారు. (3) అన్నీ ప్రభుత్వ ప్రాజెక్టులను -NOFN,NFS LWE పనులను బహిష్కరించాలి. (4) 03-12-2018 న జరగబోయే నిరవధిక సమ్మె లో పాల్గొనాలని AUAB లో భాగస్వామ్యం లేని యూనియన్లు & అసోసియేషన్లను కలిసి విజ్ఞప్తి చేయాలి. పై డిమాండ్స్ సాధన కొరకు బి ఎస్ ఎన్ ఎల్ లో ఉన్న ఉద్యోగులు అధికారులు మరియు రిటైర్ ఐయిన పెన్షనర్లు అందరు ఐక్యంగా 03-12-2018 నుంచి జరగబోవు నిరవధిక సమ్మె లో పాల్గొనేందుకు ఇప్పటినుంచే సమాయత్తం చెయ్యండి! ఐక్య సమావేశాలు జరపండి! విస్తృత ప్రచారం చేయండి! జిల్లా సెక్రెటరీలు ఏయుఏబి జిల్లా సమావేశం జరిపి ఈ కార్యక్రమాలు సమైక్యముగా, దిగ్విజయముగా అమలు చేయాలని విజ్ఞప్తి. సమ్మెకు ఉద్యోగులందరిని సంసిద్ధం చేయాలి. బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయిస్ యూనియన్

RELATED POSTS :

5 February, 2019 | Category : NEWS

సమ్మెకి సంసిద్ధత కండి.

వేతన సవరణ తదితర డిమాండ్ల పై ఇచ్చిన హామీలు అమలు చేయకుండ

READ MORE

16 February, 2019 | Category : NEWS

ఫే రివిజన్ పై పరిణామాలు

ఫే రివిజన్ పై పరిణామాలు గత రెండు రోజులుగా సిఎండి మరియు

READ MORE

16 February, 2019 | Category : NEWS

చర్చలు విఫలం- సమ్మెకి పోవాలని నిర్ణయం

ఈ రోజు కూడా ఏయుఏబి తో సిఎండి గారు చర్చలు నిర్వహించారు. డ

READ MORE